News February 14, 2026
HYD: Saturday Night.. డేటింగ్ వైబ్స్

మనోళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. ఈ Saturday Night నగరం ఫుల్ ‘డేటింగ్’ మోడ్‌లోకి వెళ్లిపోయింది. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పబ్స్‌లో DJ మోతతో యూత్ ఊగిపోతుంటే.. దుర్గంచెరువు దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్లతో లవర్స్ సందడి చేస్తున్నారు. కపుల్సే కాదు ‘సింగిల్స్’ కూడా గ్యాలెంటైన్ పార్టీలతో రచ్చ లేపుతున్నారు. పెయింటింగ్ డేట్స్, మ్యూజిక్ షోలతో సిటీ అంతా కలర్ ఫుల్‌గా మారింది. రెడ్ డ్రెస్ ఈ రోజు ట్రెండింగ్.
Similar News
News March 5, 2026
HYDలో వరుస ప్రమాదాలు.. జాగ్రత్త!

సిటీలో వరుసగా సంభవిస్తున్న ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత 2 నెలల్లో పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బాచుపల్లి ఘటన మరవక ముందే కాటేదాన్‌లో ఉదయం మంటలు చెలరేగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అగ్నిప్రమాదాలకు అవకాశం ఉందని హైడ్రా, అగ్నిమాపక బృందాలు హెచ్చరిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ పాటించాలని సూచిస్తున్నాయి.
News March 5, 2026
HYD: చదువుకొనే పిల్లలనూ వదలడం లేదు!

JNTUHలో ప్రైవేటు సంస్థల జోక్యం వివాదానికి దారితీసింది. స్టూడెంట్స్‌కు క్రెడిట్ కార్డుల ఆశ చూపుతూ ECE డిపార్ట్‌మెంట్ వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ అనిత అనుమతితోనే తాము పెట్టామని సదరు సంస్థ ప్రతినిధులు తెలపడంపై విమర్శలొస్తున్నాయి. చదువుకొనే వయసులో క్రెడిట్ కార్డులు ఇచ్చి వారిని అప్పుల ఊబిలోకి నెట్టడమేంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై మీ కామెంట్?
News March 5, 2026
HYD: గ్రేట్ సర్.. మరణించినా ప్రాణాలు కాపాడారు!

తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్‌పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చి 3న బ్రెయిన్ డెడ్ కావడంతో ఆర్గాన్స్‌ను డొనేట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు. కుటుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకం అని సజ్జనార్ ట్వీట్ చేశారు.


