News April 9, 2025
HYD: SCR రికార్డ్.. రూ.20,452 కోట్లు

సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) స్థూల ఆదాయంలో లైఫ్‌టైం రికార్డు సాధించిందని HYDలోని సికింద్రాబాద్ GM అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల ఆదాయం రూ.20,452 కోట్లు నమోదు చేసిందన్నారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరం రూ.20,339 కోట్లుగా నమోదైనట్లు పేర్కొన్నారు. గత 3 పర్యాయాలుగా పెరుగుతూ వస్తుందన్నారు.
Similar News
News October 28, 2025
కురుమూర్తి ఉద్దాల ఉత్సవంలో జేబుదొంగల చేతివాటం

వడ్డేమాన్ ఉద్దాల మండపం వద్ద కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. లాలకోటకు చెందిన నర్సింహులు జేబులో ఉన్న దాదాపు రూ.10 వేలను దొంగిలించారు. వందలాది పోలీసులు భద్రతలో ఉన్నప్పటికీ, జేబుదొంగలు తమ పనిని కొనసాగించడం విశేషం. కాగా జాతర మైదానంలో ఏటా ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News October 28, 2025
అనకాపల్లి: ‘50% సబ్సిడీపై పశువుల దాణా పంపిణీకి సిద్ధం’

అనకాపల్లి జిల్లాలో 50% సబ్సిడీతో పంపిణీ చేసేందుకు 860 మెట్రిక్ టన్నుల పశువుల దాణా సిద్ధంగా ఉందని జిల్లా పశు వైద్యాధికారి బి.రామ్మోహన్రావు తెలిపారు. మంగళవారం మాకవరపాలెంలో ఆయన మాట్లాడారు. తుఫాను కారణంగా పశువులకు మేత ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో 40 మెట్రిక్ టన్నులు సబ్సిడీపై అందజేశామన్నారు.
News October 28, 2025
మీ టీవీపై ఇంకా ఈ స్టిక్కర్లు ఉంచారా?

చాలామంది కొత్త TV కొన్నప్పుడు దాని డిస్‌ప్లేపై ఉండే ఫీచర్ల స్టిక్కర్లను తొలగించరు. పిల్లలు తొలగించినా పేరెంట్స్ తిడుతుంటారు. అయితే ఈ స్టిక్కర్లుండటం TVకి మంచిది కాదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. TV ఆన్‌లో ఉన్నప్పుడు వేడి పుట్టి ఈ స్టిక్కర్లు డిస్‌ప్లేని దెబ్బతీస్తుంటాయి. అలాగే రంగులూ మారిపోతాయని చెబుతున్నారు. స్టిక్కర్ చుట్టూ ఉన్న భాగం మాత్రమే నిగనిగలాడుతూ, మిగతా భాగం కాంతిహీనంగా మారుతుందట.


