News March 18, 2024

HYD: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. HYD జిల్లాలో 361 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 76,575 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

Similar News

News October 20, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ట్విస్ట్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇపుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో ఎత్తుగడ వేసి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత చేత నామినేషన్ వేయించిన సంగతి తెలిసిందే. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకవేళ సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణు గులాబీ పార్టీ నుంచి బరిలో ఉంటాడు.

News October 19, 2025

CM సాబ్.. తోడా హాత్ మిలావోనా!

image

సదర్ సమ్మేళన్‌లో CM రేవంత్ రెడ్డి యువతలో జోష్ నింపారు. ఓ వైపు యాదవుల బలగం, మరోవైపు దున్నరాజుల విన్యాసాలు వీక్షించేందుకు NTR స్టేడియానికి వేలాది సంఖ్యలో యువకులు తరలివచ్చారు. అంతటి రద్దీలోనూ CMను చూసిన కొందరు ఆయన్ను చరవాణిలో బంధించేందుకు, చేయి కలిపేందుకు ఆసక్తి చూపించారు. వేదిక అలంకరించబోయే ముందు యువతను చూసిన CM స్వయంగా వారి వద్దకు వెళ్లారు. సెక్యూరిటీని పక్కనబెట్టి సింప్లిసిటీని చాటారు.

News October 19, 2025

లేగదూడను చూసి CM మురిసే!

image

యాదవుల సదర్ అంటే CM‌ రేవంత్ రెడ్డికి మక్కువ అని చెప్పడానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. NTR స్టేడియం వద్ద నిర్వహించిన సదర్‌లో రేవంత్ ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. కళాకారుల నుంచి యువత వరకు అందరినీ పలకరించారు. యాదవ సోదరులతో ఫొటోలు దిగి సంభాషించారు. వేదిక ఎక్కిన తర్వాత అందంగా అలంకరించిన ఓ లేగదూడను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ దూడెను తన దగ్గరకు తీసుకోవడం సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.