News September 3, 2025
HYD: SEP 17న TG విమోచన దినోత్సవం: BJP

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లుగా బీజేపీ TG చీఫ్ రాంచందర్‌రావు తెలిపారు. వారం రోజుల ముందుగానే పరేడ్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయన్నారు. గతంలో కంటే ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Similar News
News September 5, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> మహానంది అవార్డు గెలుచుకున్న దేవరుప్పుల వాసి
> సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చాం: జనగామ ఎమ్మెల్యే
> జనగామ: వన మహోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్
> కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: కడియం
> పాలకుర్తి: గణేశుడికి 516 పిండి వంటకాలు
> బతుకమ్మ కుంటను అందంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
> దేవరుప్పుల: ఇసుక అక్రమ రవాణా వ్యక్తిపై కేసు నమోదు
> నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు
News September 5, 2025
ఖమ్మం: పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహంపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పీఈటీ కోచ్‌లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయడం తప్పనిసరి చేయాలని సూచించారు. క్లస్టర్, మండల స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో స్పోర్ట్స్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంచాలని సూచించారు.
News September 5, 2025
వరంగల్ జిల్లాలో ముందస్తు గురు పూజోత్సవాలు..!

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. కానీ మిలాద్ ఉన్ నబి పండుగ, గణపతి నిమజ్జనం ఉండడంతో ప్రభుత్వం అధికారిక హాలిడే ప్రకటించింది. దీంతో ఆయా పాఠశాలల్లో ముందస్తుగానే వర్ధన్నపేట ఉప్పరపల్లిలో సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.