News September 16, 2024

HYD: SEP 17.. ఒకే రోజు మూడు కార్యక్రమాలు!

image

HYD నగరంలో సెప్టెంబర్ 17న ఒకేరోజు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుపనుంది. అదే రోజును రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సెప్టెంబర్ 17న ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సైతం ప్రారంభంకానుంది.

Similar News

News December 4, 2025

HYD: ఫ్యూచర్ సిటీకి సల్మాన్‌ఖాన్!

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌లో మీడియా, వినోద రంగాల్లోని పెట్టుబడిదారులతో జరిగే సమావేశంలో సల్మాన్‌ఖాన్ ప్రసంగించే అవకాశం ఉంది. ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్‌ఖాన్‌ను కలిసిన విషయం తెలిసిందే.

News December 4, 2025

రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు

image

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్‌‌కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్‌లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

News December 4, 2025

ఫ్యూచర్ సిటీ: ప్రభుత్వ ప్రాధాన్యతలివే!

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఎగ్జిబిషన్ ఫ్లోర్ ప్లాన్ లీక్ అయింది. మ్యాప్ ప్రకారం, ఎగ్జిబిషన్ కేంద్ర బిందువు 5 మీటర్ల డోమ్ కాగా, అగ్రస్థానం భారత్ ఫ్యూచర్ సిటీకి దక్కింది. కీలకమైన డిఫెన్స్/స్పేస్ (1, 2) స్టాల్స్, MRDC పక్కన హాల్ పైభాగంలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాబోయే పెట్టుబడులు ఏ రంగం వైపు మొగ్గు చూపుతున్నాయో ఈ లేఅవుట్ స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ప్లాన్ కాదు, తెలంగాణ టార్గెట్!