News September 16, 2024
HYD: SEP 17.. ఒకే రోజు మూడు కార్యక్రమాలు!
HYD నగరంలో సెప్టెంబర్ 17న ఒకేరోజు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుపనుంది. అదే రోజును రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సెప్టెంబర్ 17న ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సైతం ప్రారంభంకానుంది.
Similar News
News October 10, 2024
ALERT: సద్దుల బతుకమ్మ.. HYDలో ఈ రూట్ బంద్
సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో HYD పోలీసులు ఆంక్షలు విధించారు. అమరవీరుల స్మారకస్తూపం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు సాధారణ వాహనాలకు అనుమతించరు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ బతుకమ్మ వేడుక కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
News October 9, 2024
HYD: బస్సులు, రైళ్లు FULL.. వామ్మో కష్టమే..!
హనుమకొండ, వరంగల్, తొర్రూరు, ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు HYD నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాయంత్రం వేళ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కనీసం కూర్చునే పరిస్థితి లేదని ప్రయాణికులు వాపోయారు. రైళ్లలో వెళ్తున్న వారు ప్రతి స్టేషన్‌లో దిగి మళ్లీ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News October 9, 2024
ఖైరతాబాద్: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై కమిషనర్ సమావేశం
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)ని ప్రవేశపెట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం 11 మంది ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు పెంచడానికి చురుకైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ఆపరేటర్లు అందించిన వినూత్న సాంకేతికతలను సమావేశంలో పరిశీలించారు.