News September 4, 2024

HYD: SEP-21 నుంచి కోటి మంది మహిళలకు AIలో శిక్షణ

image

కోటి మంది మహిళలకు కృత్రిమ మేద(AI)లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలతో సవిత్ ఏఐ (సౌత్ ఏసియన్ ఉమెన్ ఇన్‌ టెక్) చేతులు కలిపింది. ఈ మేరకు టీ హబ్‌లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని పత్రాలు మార్చుకున్నారు. గూగుల్ ఉమెన్ టెక్ మేకర్స్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, నాస్కామ్, మీటై, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (పిక్కీ ఎఫ్ఎల్), షీరోస్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. సెప్టెంబరు 21 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.

Similar News

News February 26, 2026

HYD: ఇంటర్ విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్

image

TGBIE ప్రత్యేకంగా స్టూడెంట్స్ & పేరెంట్స్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు తదితర అంశాలపై మార్గదర్శనం, సందేహాల నివృత్తికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ తెలిపారు. హెల్ప్‌లైన్ నం. 040-24655027, IVR. No. 9240205555కు కాల్ చేసి విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం వెంటనే సంప్రదించాలని సూచించారు.

News February 26, 2026

HYD: ఫోన్ రిపేర్, ఐటీఐ, ల్యాండ్ సర్వేలో ఫ్రీ కోర్సు

image

ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ వర్గాలకు చెందిన 18- 35 ఏళ్ల యువత నుంచి ఉచిత శిక్షణ కోర్సులకు FEB 25- మార్చి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ఎంఈపీ టెక్నీషియన్ (ఇంటర్/ఐటీఐ/డిప్లొమా), స్మార్ట్‌ఫోన్ రిపేర్ (టెన్త్) కోర్సులకు 3 నెలల శిక్షణ ఇస్తారు. ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం

News February 26, 2026

హైదరాబాద్‌లో ప్రత్యక్ష నరకం

image

HYDలో దోమల బెడద కునుకు లేకుండా చేస్తోంది. పొగబెట్టినా పోతలే, నిద్రపోనిస్తలే.. ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్, కుంట్లూర్, పెద్దఅంబర్‌పేట్, మంచాల, రాజేంద్రనగర్, శంషాబాద్, షాద్‌నగర్లో ఎక్కువగా ఉంది. రాత్రంతా నరకం చూపిస్తున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా వ్యాప్తిచెందినా యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదా అని ప్రశ్నిస్తున్నారు.