News March 17, 2024
HYD: KCRను మోసం చేయడం సిగ్గుచేటు: ఆనంద్ గౌడ్
గోషామహల్లో BRS అభ్యర్థిగా పోటీ చేసిన నందకిశోర్ కాంగ్రెస్లోకి వెళ్లడం సరికాదని ఆ పార్టీ నేత ఆనంద్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్న వ్యక్తిని ఎంత నీచంగా అభివర్ణించినా తక్కువేనని అన్నారు. లోకల్ లీడర్ కాకపోయినా MLA టికెట్, ఆయన కూతురికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన KCRను మోసం చేయడం సిగ్గుచేటు అంటూ ఆనంద్ మండిపడ్డారు.
Similar News
News November 23, 2024
జూబ్లీహిల్స్: శివలింగం నుదుటిపై సింధూరమైన సూర్యకిరణాలు
జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ సన్నిధిలో అద్భుతం చోటు చేసుకుంది. శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివలింగం నుదుటిపై సింధూరంలా కనిపించాయి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడి.. సింధూరంలో కనిపించిందని రామంజి గురుస్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారన్నారు.
News November 23, 2024
TGSRTC పనితీరుపై HYDలో మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం TGSRTC పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక పరమైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.
News November 23, 2024
HYD: ఇవేంటో గుర్తొచ్చాయా? అర్థం ఇదే..!
కిరాణా దుకాణంలో తరచుగా పాలు, ఉప్పు, బియ్యం, గోధుమ కొంటూనే ఉంటాం. ఎప్పుడైనా ఆ ప్యాకెట్లపై +F గుర్తు చూశారా..? ఈ గుర్తు ఉంటే, ఆ పదార్థాలు ఆరోగ్యానికి మంచివని FSSAI తెలిపినట్లు HYD ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. +F అంటే ఫోర్టిఫైడ్ + మినరల్స్ + విటమిన్స్ అని అర్థం. వీటి ద్వారా శరీరానికి రోజుకు కావలసిన పోషకాలు అందుతాయన్నారు.