News July 22, 2024
HYD: STP పనులను పరిశీలించిన కమిషనర్ ఆమ్రపాలి కాట
జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP) పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. STP పరిసరాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ నెల 27న CM రేవంత్ రెడ్డి ఈ ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Similar News
News November 29, 2024
HYD: అప్పు చేసి పిల్లలకు వంట చేస్తున్నారు: CITU
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు MEO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. CITU జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, మెనూ ఛార్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతూ.. కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News November 28, 2024
HYD: 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య
వచ్చే డీఎస్సీలో 26 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. ఏ పాఠశాలకు వెళ్లినా టీచర్ల కొరత ఉందన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో 6 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదన్నారు.
News November 28, 2024
HYD: జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి సమావేశం
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధిపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి, R&B ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. అధికారులతో కలిసి వారు భువనగిరి పరిధిలోని రహదారుల అభివృద్ధి, మరమ్మతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.