News April 18, 2025
HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.
Similar News
News April 20, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

3 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News April 20, 2025
హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్ సాయం కోరిన బంగ్లా

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
News April 20, 2025
సీఎం చంద్రబాబు బర్త్ డే.. కేక్ కట్ చేసిన పరిటాల సునీత

సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని తిరుమల దేవర దేవస్థానంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు చేయించారు. తమ అధినేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.