News April 18, 2025
HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.
Similar News
News April 19, 2025
జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్‌లో తన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 19, 2025
ఖమ్మం కంచుకోటలో.. ఎర్ర జెండా పార్టీలు పుంజుకునేనా?

దేశంలో కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అడ్డాగా ఉండేది. జిల్లాను CPI, CPM, CPIML మాస్ లైన్, CPIML న్యూ డెమోక్రసీ నేతలు ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. అలాంటి ప్రాంతాల్లో నేడు ఆ పార్టీల ఉనికి తగ్గుతోంది. నాడు ప్రజాసమస్యలపై కదిలిన ఎర్ర దండు.. నేడు ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే కమ్యూనిస్టుల మధ్య సమన్వయం లోపించిందని అంటున్నారు. మళ్లీ ఆ పార్టీలు పుంజుకునేనా.. కామెంట్ చేయండి.?
News April 19, 2025
ఆర్ఎస్పీపై తప్పుడు ప్రచారాలు.. తెలంగాణ గళంపై ఫిర్యాదు

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు “తెలంగాణ గళం” అనే సోషల్ మీడియా సంస్థపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ గళం అనే సోషల్ మీడియా సంస్థ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్పీ ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేసిందన్నారు. బీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా చేసిన ఈ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.