News April 18, 2025

HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

image

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.

Similar News

News April 20, 2025

IPL: CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

image

CSK ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్‌రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం ధోనీ సేన NRR -1.276గా ఉంది. ఇది మెరుగవ్వాలంటే భారీ తేడాలతో మ్యాచులు గెలవాలి. CSK ప్లేఆఫ్స్‌కు చేరుతుందని అనుకుంటున్నారా? మీ కామెంట్.

News April 20, 2025

‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

image

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్‌లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో దిలీప్ రాజా మాట్లాడుతూ త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.

News April 20, 2025

భారీగా పడిపోయిన ‘దొండ’ రేటు!

image

<<16113156>>ఉల్లి,<<>> టమాటా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో దొండకాయల ధర భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ.150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.

error: Content is protected !!