News July 7, 2025
HYD: T WORKS వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్.!

HYD నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నెటిజన్లు X వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. T WORKS వద్ద రోడ్డు డిజైన్ సైతం సరిగా లేదని, యూటర్న్ సమీపంలోనే ఐలాండ్ నిర్మించడం కారణంగా ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుందని తెలిపారు. రోడ్డు ఇరుకుగా మారడానికి డిజైన్లు సైతం కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళం: ‘పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ రోజు ఒక మొక్క నాటాలి’

ఈ నెల 10వ తేదీన పాఠశాలల్లో మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహిస్తున్నందున ఆరోజు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం విద్యాసంస్థల ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణంతో పాటు వారి గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువ గట్లు, రోడ్లు పక్కన మొక్కలు నాటాలన్నారు.
News July 7, 2025
సింహాచలం: ఆ రెండు రోజులు ఆర్జిత సేవలు రద్దు

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి స్వామి వారి దేవాలయంలో ఈనెల 9,10 తేదీలలో జరిగే గిరి ప్రదక్షిణ సందర్భంగా స్వామివారికి జరిగే ఆర్జిత సేవలను రద్దు చేశారు. నిత్య కళ్యాణోత్సవం, గరుడ సేవ, స్వర్ణపుష్పార్చన, తులసీదళార్చన వంటి సేవలను రద్దుచేసి సుప్రభాతం, ఆరాధన ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
News July 7, 2025
విశాఖలో యాక్సిడెంట్.. పార్వతీపురం జిల్లా వాసి మృతి

ఆనందపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పార్వతీపురం జియమ్మవలసకు చెందిన కరకవలస రమణమూర్తి తన కుమారుడితో కలిసి కారులో మద్దిలపాలెంలోని అల్లుడు ఇంటికి వస్తున్నారు. ఆనందపురం హైవే బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొంది. రమణమూర్తి అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలపాలైన సంతోష్‌ను ఆసుపత్రికి తరలించినట్లు ఆనందపురం సీఐ తెలిపారు.