News June 5, 2024
HYD: TDP గెలుపు.. BRS MLA సంతోషం

ప్రజలు ఇచ్చిన అవకాశంతో అహంకారాన్ని నెత్తిన ఎక్కించుకునే నాయకులకు ఏపీ ప్రజల తీర్పు చెంపపెట్టు లాంటిదని HYD రాజేంద్రనగర్ MLA, BRS నేత ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఏపీలో TDP, జనసేన, BJP కూటమి ఘన విజయం సాధించడంపై ఆయన శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజలు 2019లో జగన్కు తిరుగులేని మెజారిటీతో విజయం అందించినా నియంతృత్వం, అహంకారం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకే ఆయన పరిమితమయ్యారని మండిపడ్డారు.
Similar News
News December 4, 2025
GHMC మెగా విలీనంపై అడ్డంకులు.. మరో ఏడాది HMDA నిబంధనలే!

విశాలమైన GHMC ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనా క్షేత్రస్థాయిలో పాలనా ప్రణాళికకు అడ్డంకులు తప్పడం లేదు. 27 ULBsను విలీనం చేసినప్పటికీ పౌరులకు ఏకరూప నిబంధనలు ఇప్పట్లో అందుబాటులోకి రావు. విలీన ప్రాంతాల్లో ప్రస్తుత HMDA మాస్టర్ ప్లాన్ 2013 జోనల్ నిబంధనలే ఇంకో ఏడాది పాటు అమలులో ఉంటాయి. సంక్లిష్టమైన రూల్స్ను ఏకీకృతం చేయడంలో అధికారుల జాప్యం కారణంగా కొత్త GHMC, HMDA మాస్టర్ ప్లాన్ 2031 ఆలస్యం కానుంది.
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్: 22 కిలో మీటర్ల మార్గంలో పోలీసుల తనిఖీలు

గ్లోబల్ సమ్మిట్ కోసం భద్రత అసాధారణ స్థాయికి చేరింది. తుక్కుగూడ నుంచి మీర్ఖాన్పేట్ వరకు ఉన్న 22KM మార్గంలో బాంబ్, డాగ్ స్క్వాడ్లు అణువణువూ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఆరు ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 24 నుంచే ప్రధాన భద్రతాధికారి హై అలర్ట్ ప్రకటించి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News December 4, 2025
HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.


