News June 5, 2024
HYD: TDP గెలుపు.. BRS MLA సంతోషం
ప్రజలు ఇచ్చిన అవకాశంతో అహంకారాన్ని నెత్తిన ఎక్కించుకునే నాయకులకు ఏపీ ప్రజల తీర్పు చెంపపెట్టు లాంటిదని HYD రాజేంద్రనగర్ MLA, BRS నేత ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఏపీలో TDP, జనసేన, BJP కూటమి ఘన విజయం సాధించడంపై ఆయన శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు తిరుగులేని మెజారిటీతో విజయం అందించినా నియంతృత్వం, అహంకారం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకే ఆయన పరిమితమయ్యారని మండిపడ్డారు.
Similar News
News November 5, 2024
HYD: నాంపల్లి క్రిమినల్ కోర్టుకు దీపాదాస్ మూన్షీ
నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి హాజరయ్యారు. దీపా దాస్‌పై BJP నేత ప్రభాకర్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఆయనపై దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసు వేసింది. దీపాదాస్‌తో పాటు కోర్టుకు బీజేపీ నేత ప్రభాకర్ హాజరయ్యారు. మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.
News November 5, 2024
రేపు సోమాజిగూడలో సైబర్ సెక్యూరిటీ వార్షిక సమ్మిట్
సైబర్ భద్రతకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు సైబర్ సెక్యూరిటీ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో బుధవారం ఈ కార్యక్రమం జరగనుంది. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సైబర్ భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలను సమావేశంలో చర్చిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారన్నారు.
News November 5, 2024
HYD: మహిళపై ముగ్గురి అత్యాచారం
అమీర్‌పేట్: మధురానగర్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇళ్లలో పనికి వెళ్లే ఓ మహిళ నిన్న కొండాపూర్‌లో పనికెళ్లి తిరిగొస్తుండగా ఆటోలో ముగ్గురు వచ్చి తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి రూమ్‌లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. తప్పించుకున్న ఆమె దుస్తులు లేకుండా బయటకు రాగా పక్కింటి మహిళ గమనించి నైటీ ఇచ్చారు. కేసు నమోదైంది.