News January 19, 2026
HYD: TDR అంటే ఏమిటి..? ఎందుకు ముఖ్యం..?

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) అనేది ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే ఓ అదనపు నిర్మాణ హక్కు. చెరువుల FTL, బఫర్ జోన్లు లేదా రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన రైతులకు/ యజమానులకు నగదుకు బదులుగా ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. అలాగే యజమానులు ఆ హక్కులను వేరే చోట అదనపు అంతస్తుల కోసం వాడుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. ఇది పర్యావరణ పరిరక్షణకు, మౌలిక సదుపాయాల కల్పనకు కీలకం.
Similar News
News February 18, 2026
BREAKING: పంతిని సమీపంలో యాక్సిడెంట్

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై పంతిని సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు నుంచి వెళ్తున్న ట్రాక్టర్‌ను అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్‌తో పాటు కారు ధ్వంసమైంది. ఇంజిన్‌లోని డీజిల్ అంతా రహదారిపై ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
News February 18, 2026
CSIR-IICBలో ఉద్యోగాలు

కోల్‌కతాలోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(I<
News February 18, 2026
పాలమూరు: అద్దెకు బస్సులు.. ఫోన్ చేయండి

వివాహా శుభాకార్యాలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News” ప్రతినిధితో తెలిపారు.
1. అచ్చంపేట-99592 26291
2. గద్వాల్-99592 26290
3. కల్వకుర్తి-99592 26292
4. కొల్లాపూర్-90004 05878
5. కోస్గి-99592 26293
6. మహబూబ్ నగర్-99592 26293
7. నాగర్ కర్నూల్-99592 26288
8. నారాయణపేట-99592 26293
9. షాద్నగర్-99592 26287
10. వనపర్తి-99592 26289


