News August 8, 2025

HYD: TG CPGET.. 7,518 మంది హాజరు

image

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం 44 సబ్జెక్టులకు రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్షలు (TG CPGET) కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ 3 సెషన్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం 5 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8,587 మంది అభ్యర్థులకు గాను.. 7,518 (87.55%) మంది హాజరైనట్లు ఉస్మానియా యూనివర్సిటీ TG CPGET డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు.

Similar News

News August 9, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జఫర్గడ్: ఇద్దరు మహిళల దారుణ హత్య
> జిల్లా వ్యాప్తంగా సీపీఎం నేతల నిరసన
> ఈనెల 12న పాలకుర్తికి మందకృష్ణ మాదిగ రాక
> జనగామ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య
> ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన: కలెక్టర్
> విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలి: కలెక్టర్
> దేవరుప్పుల: మాజీ సర్పంచ్ మృతి
> జనగామ: డ్రైనేజీ పనుల వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన

News August 9, 2025

P4లో వెనుకబడ్డ జిల్లాలు.. సీఎం అక్షింతలు తప్పవా?

image

AP: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. AUG 15 నాటికి 80% పేద కుటుంబాలకు సాయం అందించాలని CM చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. కాకినాడ, గుంటూరు జిల్లాలు 95% లక్ష్యాన్ని చేరుకోగా.. నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో కనీసం 50% కూడా మార్గదర్శులు దత్తత తీసుకోలేదు. ఈ జిల్లాల అధికారులకు CM చేతుల్లో అక్షింతలు తప్పవని చర్చ నడుస్తోంది.

News August 9, 2025

నిర్మల్ జిల్లాలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం పూజలు

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మీ పూజలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలో వచ్చే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఎంతో నిష్ఠగా చేసుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని శాస్త్రీయ పద్ధతిలో పూలతో అలంకరించి పూజలు చేశారు. పూజల అనంతరం ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కుటుంబాల్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉండాలని మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.