News March 21, 2025
HYD: TG ఖోఖో జట్టు.. మనోళ్లు వీళ్లే !!

దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణ ఖోఖో జట్టుకు కే.స్వాతి ప్రియాంక (PD,గోల్కొండ-HYD), కే.లీల (PD, బోయిన్ పల్లి-HYD), కే.కవిత (PD,పుట్ట పడ్-VKB) ఎంపికయ్యారు. దీంతో వీరిని ఎమ్మెల్యేలు, నేతలు, ఆయా పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News March 31, 2025
NZB: సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడాలి: MLA

సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఆదివారం ఆయన నగరంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో, పలు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. బస్వా గార్డెన్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు నగర శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవితం అంటేనే సుఖ దుఃఖాల కలయిక అని పేర్కొన్నారు.
News March 31, 2025
అల్లూరి జిల్లాలో చికెన్ రేటు ఎంతంటే?

అల్లూరి జిల్లాలో చికెన్ ధరలు సోమవారం పెరిగాయి. స్కిన్ లెస్ బ్రాయిలర్ కిలో రూ.300కాగా, స్కిన్‌తో రూ.280 వరకు అమ్ముతున్నారు. ఆదివారం ఉగాది కావడంతో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉన్నారు. సోమవారం రంజాన్ పండుగ కూడా కావడంతో మాంసం కొనుగోళ్లు బాగా పెరిగాయి. దుకాణాలన్నీ వినియోగదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరలు పెరిగినట్లు పలువురు చెబుతున్నారు.
News March 31, 2025
సిద్దిపేట: ‘బీసీ రిజర్వేషన్లు 42 నుంచి 56 శాతానికి పెంచాలి’

బీసీ రిజర్వేషన్లు 42 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని బీఎస్పీ సెంట్రల్ కో-ఆర్డినేటర్ నిసాని రామచంద్రం డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 46% నుంచి 56 శాతానికి పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తన చిత్త శుద్ధి చాటాలన్నారు.