News February 2, 2026
HYD TO BLR.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో హైస్పీడ్ రైళ్లు గంటకు 350KM వేగంతో ప్రయాణిస్తాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో, పుణేకు 1.45 గంటల్లో, చెన్నైకి 2.55 గంటల్లో చేరుకోవచ్చన్నారు. హైస్పీడ్ కారిడార్‌తో AP-TG-TN మధ్య ఎకానమీ, హెల్త్, టూరిజం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు గేమ్ ఛేంజర్‌గా మారతాయని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
విద్యుత్ ‘కట్‘కటా లేకుండా ఏర్పాట్లు

TG: ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ఎండలు తీవ్రమై రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 18000 MW వరకు పెరగొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రేటర్ HYDలోనే ఈసారి 4000 MW అవసరమని, యాసంగి(ఏప్రిల్, మే)లో సాగుకు వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా యాదాద్రి ప్లాంటులో 4000 MW ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. పీక్ అవర్‌లో విద్యుత్ రేట్లు భారీగా ఉన్నా కొనుగోలుకు రెడీ అవుతోంది. 2025లో 17500 MW డిమాండ్ ఉంది.
News February 16, 2026
విశ్వక్‌కు వరుస షాక్‌లు.. రూటు మార్చాల్సిందేనా?

ENE, ఫలక్‌నుమాదాస్ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చాలా కాలంగా హిట్‌కు దూరమైన ఆయనకు తాజాగా రిలీజైన ‘ఫంకీ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు ‘లైలా’, ‘మెకానిక్ రాకీ’ కూడా ఫెయిలయ్యాయి. దీంతో విశ్వక్ సరైన కథలను ఎంపిక చేసుకోవట్లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ENE2’, ‘కల్ట్’ సినిమాలైనా ఆయనకు హిట్ ఇస్తాయేమో చూడాలి.
News February 16, 2026
ఆగ్నేయ మూలలో వాస్తు దోషం ఉంటే?

ఆగ్నేయం దోషపూరితంగా ఉంటే కుటుంబంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘కష్టపడి సంపాదించిన ధనం వృథా అయ్యే ఛాన్సుంది. రావలసిన డబ్బు సమయానికి అందదు. ఇంట్లో మహిళలు మానసిక వేదనకు, అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కుటుంబీకుల మధ్య ఐక్యత లోపించి, నిరంతరం చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థలాన్ని వినియోగించుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


