News October 25, 2024

HYD టు యాదాద్రి.. ఇక MMTS రైలు సర్వీస్

image

HYD నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులు ఇక MMTS సర్వీస్‌ను ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్రం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది యాదాద్రి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేజ్ కింద సర్వీస్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 25, 2024

DANGER: సమోసా, చిప్స్, ఫాస్ట్‌ఫుడ్స్‌తో డయాబెటిస్

image

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మధుమేహానికి దారి తీస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తేల్చింది. సమోసా, పకోడి, ఫ్రైడ్ చికెన్, చిప్స్, కేక్స్, ఫాస్ట్ ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతున్నట్లు నిర్ధారించింది. ఇవి శరీరంలో హానికరమైన అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్‌గా మారి ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తున్నాయి. దీంతో టైప్-2 మధుమేహం, ఊబకాయానికి దారితీస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

News October 25, 2024

డేవిడ్ వార్నర్‌‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత

image

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధం తొలిగిపోయింది. 2018లో శాండ్ పేపర్ వివాదంలో అతడిని కెప్టెన్సీ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బ్యాన్ చేసింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్‌ BBLలో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా ఉండే అవకాశం లభించింది.

News October 25, 2024

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 1000కి.మీ పాదయాత్ర

image

TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఆధ్వర్యంలో మహా పాదయాత్రకు దళితులు సిద్ధం అవుతున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు సాగే పాదయాత్రను మాజీ ఎంపీ హర్షకుమార్ ఇవాళ ప్రారంభిస్తారు. 38 రోజుల పాటు 16 జిల్లాలు, 35 నియోజకవర్గాల మీదుగా 1000కి.మీ మేర ఈ పాదయాత్ర సాగనుంది. డిసెంబర్ 1న ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నారు.