News March 16, 2024
HYD: ఏసీబీ వలలో జలమండలి అధికారులు
రెవెన్యూ సర్కిల్ జలమండలి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేశ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ను అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి కలిశారు. తన పని అవ్వాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్బర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు రాకేశ్ దొరికాడు. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది.
Similar News
News December 3, 2024
HYDలో మరో ఫ్లై ఓవర్ ఓపెన్
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆరంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.04 కిలో మీటర్ల పొడవు, 6 లైన్లతో నూతన ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. దీనివలన పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
News December 3, 2024
చేవెళ్ల యాక్సిడెంట్ ఎఫెక్ట్.. అధికారుల హెచ్చరిక
చేవెళ్ల మం. పరిధి ఆలూరు గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ హెచ్చరిక బ్యానర్ ఏర్పాటు చేసింది. హైవే పక్కన కూరగాయలు అమ్మితే రూ. 10 వేల FINE విధిస్తామన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్, రైతు బజార్లో కూరగాయలు అమ్ముకోవాలని సూచించారు. ఇందుకు తగు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
News December 3, 2024
REWIND: HYDలో ఆత్మార్పణం
తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి ప్రాణత్యాగం పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్లో జరిగిన ధర్నాలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న శ్రీకాంత చారి నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ‘జై తెలంగాణ.. జై తెలంగాణ’ అంటూ ఆయన చేసిన నినాదాలు ఉద్యమకారుల కంట నీరు తెప్పించాయి. తీవ్రగాయాలతో యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన డిసెంబర్ 3(2009)న చనిపోయారు. నేడు శ్రీకాంత చారి వర్ధంతి.