News August 10, 2024
HYD: Way2 News కథనంపై స్పందించిన రిజిస్ట్రార్

PHD ఫలితాల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ అనే శీర్షికపై Way2 Newsలో వచ్చిన కథనానికి JNTU యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందించారు. సోమవారం PHD ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Similar News
News November 28, 2025
ట్రాఫిక్ చలాన్లపై నివేదిక ఇవ్వాలని హోంశాఖకు హైకోర్టు నోటీసులు

ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసిన విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్ వేస్తున్నారని నగరవాసి రాఘవేంద్ర చారి పిటిషన్ దాఖలు చేశారు. తనకి 3 చలాన్లు వేశారని, ట్రాఫిక్ పోలీసులు సొంత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ ఎన్ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
News November 28, 2025
కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.
News November 28, 2025
HYD: సిబ్బంది లేమి.. నియామకాలేవి: పద్మనాభరెడ్డి

రాష్ట్రంలోని 25 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేమి తీవ్రంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకి లేఖ రాసింది. 1,413 మంది కావాల్సిన చోట 111 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 22 ఆస్పత్రుల్లో ఒక్క నియామకం జరగలేదని లేఖలో పేర్కొన్నారు. సిబ్బంది లేక దవాఖానాలు మూతబడి, వాటిలో కొన్ని చోట్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1,302 పోస్టులను భర్తీ చేసి ఆస్పత్రులు ప్రారంభించాలన్నారు.


