News February 1, 2025

HYD: WOW.. త్వరలో అద్భుతమైన పార్క్ ఓపెన్!

image

HYD నగరంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న హిమాయత్ సాగర్, కొత్వాల్ గూడ పార్క్ త్వరలో ఓపెన్ కానుంది. దాదాపుగా 1000 రకాల పక్షులతో పక్షిశాలను సైతం సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఎక్వేరియం, పిక్నిక్ పార్కు, రిసార్టులు, అడ్వెంచర్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు అందుబాటులో ఉంచారు.

Similar News

News September 18, 2025

TODAY HEADLINES

image

⁎ హైదరాబాద్‌లో భారీ వర్షం.. వరదమయమైన రోడ్లు
⁎ TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
⁎ 1-12 తరగతుల వరకు సమూల మార్పులు: CM రేవంత్
⁎ ప్రధాని మోదీ భారత్‌కు అతిపెద్ద ఆస్తి: సీఎం చంద్రబాబు
⁎ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
⁎ కొత్త పార్టీని ప్రకటించిన MLC తీన్మార్ మల్లన్న
⁎ EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: EC
⁎ ఆస్ట్రేలియాపై భారత మహిళల జట్టు ఘనవిజయం

News September 18, 2025

HYD: సైకిళ్లపై తిరుగుతూ.. తామున్నామంటున్న మహిళా పోలీస్

image

నాగోల్ PS పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మహిళా పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వీధుల్లోకెళ్లి తెలుసుకున్నారు. గృహహింస, వేధింపులు, అవాంఛనీయ ప్రవర్తన, మద్యం మత్తులో అల్లర్ల సమస్యలపై అవగాహన కల్పించారు. ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలిచి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డయల్ 100, 112, షీ టీమ్స్ సేవలను ఉపయోగించుకోవాలని స్థానికులకు సూచించారు.

News September 18, 2025

ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

image

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్‌లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.