News January 25, 2025

HYD: WOW.. పట్టణం మధ్యలో పచ్చదనం..!

image

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో పట్టణం మధ్యలో 120 ఎకరాల్లో పచ్చని అద్భుతమైన శాంతివనం పార్క్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంత పెద్ద పట్టణానికి ఈ పచ్చని పార్క్ ఒక వరంగా పర్యావరణ ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. వాకింగ్ ట్రాక్, క్రీడా ప్రాంగణం, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ఏరియా ఇలా ఎన్నో సదుపాయాలు పార్క్ సొంతం. పల్లెటూరి వాతావరణం ఆస్వాదించి, ఆరోగ్యం పొందేందుకు ఇదొక చక్కటి ప్రాంతం. మంత్లీ పాస్ కూడా ఉంది.

Similar News

News January 8, 2026

SV ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్

image

తిరుపతిలోని TTD ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్‌ను కేంద్ర మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఈ సెంటర్ దోహదపడుతుంది. విద్యార్థుల ఆలోచనకు జీవం పోసి నూతన ఆవిష్కరణలను వెలికితీయవచ్చు. దీనిపై కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.

News January 8, 2026

ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్

image

TG: ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.

News January 8, 2026

నేడు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం

image

విష్ణువుకు ఇష్టమైన గురువారం నాడు పసుపు రంగు వస్తువులు దానమిస్తే జాతకంలో బృహస్పతి దోషాలు తొలగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. పేదలకు పసుపు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, పసుపు మిఠాయిలను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. స్తోమతను బట్టి చేసే దానం, విష్ణుమూర్తి కృపతో శుభాలను చేకూరుస్తుంది.