News February 12, 2025
HYD: WOW.. 250 ఎకరాల్లో పచ్చని పార్క్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319096190_15795120-normal-WIFI.webp)
HYD చేరువలో RR జిల్లా నార్సింగి మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్కింగ్ పార్కులో ప్రతి శనివారం నేచర్ క్యాంపులు జోరుగా సాగుతున్నాయి. ఈ పార్కు 250 ఎకరాల్లో విశాలంగా విస్తరించి ఉంది. ఉ.5 గంటలకు నిద్రలేపే పక్షుల సందర్శన, ట్రెక్కింగ్ కోసం తీసుకెళ్తున్నారు. పచ్చని వాతావరణంలో అమితానందం పొంది, సకుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ఇదొక చక్కటి ప్రాంతంగా పర్యటకులు చెబుతుంటారు. #SHARE IT
Similar News
News February 12, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి కొనుగోళ్లు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739345938260_50031802-normal-WIFI.webp)
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పత్తి మార్కెట్‌లో కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. పత్తికి కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధర మాత్రమే అందుతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాకు రూ.6,811 చొప్పున పలుకుతోంది.
News February 12, 2025
NZB: విచారణ కోసం తీసుకెళ్లారు.. వ్యక్తి సూసైడ్ అటెంప్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344209175_50139228-normal-WIFI.webp)
విచారణ నిమిత్తం తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన NZBలో కలకలం రేపింది. గూపన్పల్లిలో ఓ డాక్టర్ షెడ్‌లో పని చేస్తున్న బోధన్ మండలం కల్దుర్కికి చెందిన రాజును ముగ్గురు వ్యక్తులు వచ్చి ఓ చోరీ కేసు విషయంలో విచారణ కోసం తీసుకెళ్లినట్లు అతడి భార్య లక్ష్మి తెలిపారు. కాగా అనంతరం అతడు గడ్డి మందు తాగడని, దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
జేఈఈ మెయిన్‌లో బాన్సువాడ విద్యార్థి ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739338360478_51869222-normal-WIFI.webp)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 99.84 శాతం సాధించి అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థికి కాలనీవాసులు అభినందనలు తెలిపారు. అభినయ్ మాట్లాడుతూ.. ఈ ప్రతిభ కనబర్చడానికి చాలా కష్టపడ్డానన్నారు.