News December 13, 2024
HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు
సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 27, 2024
మహిళల రక్షణకు చట్టాల్లో మార్పులు వచ్చాయి: CI
ఆడపిల్లలు, చిన్నారులను గౌరవించకున్నా పర్వాలేదు కానీ అగౌరవపరిచి హింసకు గురిచేస్తే చట్ట ప్రకారం జైలుకెళ్లడం ఖాయమని HYDలోని శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈరోజు ఓ గార్డెన్లో మహిళల మానసిక హింస, పలు అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడపిల్లలు నేటి సమాజంలో ధైర్యంగా ఉండాలంటే చదువుకోవాలని తద్వారా చట్టాల గురించి తెలుస్తుందన్నారు.
News December 26, 2024
రేపు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సమావేశం
బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో రేపు బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు, 40కి పైగా బీసీ సంఘాలు పాల్గొననున్నారు. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 10 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
News December 26, 2024
HYD: ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను ఖండించిన KTR
BRS రాష్ట్ర నేత <<14984793>>ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను<<>> పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. BRS పార్టీకి కేసులేమి కొత్త కాదన్నారు.