News February 3, 2025
HYD: అబద్ధాలు చెప్పిన KCR: కోదండరాం రెడ్డి
కాళేశ్వరం కట్టతో పాటు అది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ KCR అవాస్తవాలు కూడా నిర్మించారని MLC కోదండరాం రెడ్డి ఆరోపించారు. HYD సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని TG మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. KCR అబద్ధాలు చెప్పారని, కాళేశ్వరంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.
Similar News
News February 3, 2025
17% పెరిగిన జీఎస్టీ ఆదాయం
తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.
News February 3, 2025
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ
ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే విచారించి పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ తగిన సమయంలో విచారించి న్యాయం చేయాలన్నారు.
News February 3, 2025
వరంగల్: ప్రజావాణిలో ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్
వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఆర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారదాదేవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.