News October 15, 2024
HYD: ‘అబ్దుల్ కలాం’ అవార్డుకు వేమూరి దంపతుల ఎంపిక
ప్రముఖ కవి, గాయకుడు వేమూరి అనంత రామకృష్ణశర్మ, ప్రముఖ లలిత సంగీత, సీని గాయని వేమూరి మంజుల దంపతులు భారతరత్న డా. APJ అబ్దుల్ కలాం అవార్డుకు ఎంపికయ్యారు. సంగీతం, సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వేమూరి దంపతులకు ఈరోజు పినాకిని సంస్థ ఆధ్వర్యంలో HYD త్యాగరాయగానసభలో అవార్డు ప్రదానం చేయనున్నారు. MLC మధుసూదనాచారీ, సీల్వెల్ కార్పొరేషన్ CMD బండారు సుబ్బారావు తదితరులు హాజరుకానున్నారు.
Similar News
News November 24, 2024
ఓయూలో రాజకీయ సభలకు అనుమతివ్వొద్దు: BRSV
ఓయూలో ఎలాంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని BRSV రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. శనివారం ఓయూ ఉపకులపతి కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. శాంతియుతంగా ఉన్న ఓయూలో రాజకీయ సభలు పెట్టి యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ చూస్తుందన్నారు. నూతన విద్యార్థులకు గ్రూప్ పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు.
News November 23, 2024
TGSRTC పనితీరుపై HYDలో మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం TGSRTC పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక పరమైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.
News November 23, 2024
జూబ్లీహిల్స్: శివలింగం నుదుటిపై సింధూరమైన సూర్యకిరణాలు
జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ సన్నిధిలో అద్భుతం చోటు చేసుకుంది. శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివలింగం నుదుటిపై సింధూరంలా కనిపించాయి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడి.. సింధూరంలో కనిపించిందని రామంజి గురుస్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారన్నారు.