News October 15, 2024

HYD: ‘అబ్దుల్ కలాం’ అవార్డుకు వేమూరి దంపతుల ఎంపిక

image

ప్రముఖ కవి, గాయకుడు వేమూరి అనంత రామకృష్ణశర్మ, ప్రముఖ లలిత సంగీత, సీని గాయని వేమూరి మంజుల దంపతులు భారతరత్న డా. APJ అబ్దుల్ కలాం అవార్డుకు ఎంపికయ్యారు. సంగీతం, సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వేమూరి దంపతులకు ఈరోజు పినాకిని సంస్థ ఆధ్వర్యంలో HYD త్యాగరాయగానసభలో అవార్డు ప్రదానం చేయనున్నారు. MLC మధుసూదనాచారి, సీల్‌వెల్ కార్పొరేషన్ CMD బండారు సుబ్బారావు తదితరులు హాజరుకానున్నారు.

Similar News

News October 15, 2024

HYD: త్వరలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క

image

చాలకాలంగా పెండింగులో ఉన్న అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్మెంట్​ లెటర్స్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జేడీ శైలజ, తదితరులు ఉన్నారు.

News October 15, 2024

HYD: విడాకులు తీసుకున్నా.. కలిసే మోసాలు

image

దంపతులు విడాకులు తీసుకున్నా.. కలిసే మోసాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకకు చెందిన మహ్మద్, రేష్మ HYDకు వచ్చి జాబ్ కన్సల్టెన్సీలో పనికి కుదిరారు. 2013లో వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నా.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు దిగారు. ఆమె మరో పెళ్లి చేసుకున్నా మోసాలు చేస్తూ పట్టుబడ్డారు. కేసు నమెదు చేసి ఫోన్లు, ల్యాప్‌టాప్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

News October 15, 2024

HYD: ఈ నెల 22న కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపు

image

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.