News May 2, 2024

HYD: అమ్మాయి‌ పేరుతో నగ్న చిత్రాలు.. ARREST

image

అమ్మాయిల పేరుతో మోసగిస్తున్న యువకుడిని CYB సైబర్‌క్రైమ్‌ అరెస్టు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన దినేశ్‌.. బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడ్డాడు. ఈజీ మనీ కోసం డేటింగ్‌ యాప్‌‌లో యువతి ఫొటోలు పెట్టి అకౌంట్ తెరిచాడు. యువకులతో అమ్మాయిలా చాటింగ్ చేస్తూ, నగ్న చిత్రాలు పంపుతూ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దినేశ్‌‌ను అరెస్ట్ చేశారు.

Similar News

News January 13, 2025

 ఇంజినీరింగ్ సిలబస్‌లో మార్పులు: బాలకృష్ణా రెడ్డి

image

రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఏటా లక్ష మందికిపైగా పట్టభద్రులు బయటకు వస్తున్నారు. వీరిలో పది శాతం మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని JNTU ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్‌ వి.బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్‌ సిలబస్‌లో నైపుణ్యాలను పెంచే పాఠ్యాంశాలు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందుకే వచ్చే విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌ను సమూలంగా మార్చాలంటున్నామని తెలిపారు.

News January 13, 2025

HYDలో విదేశీయులు.. అందు కోసమే..!

image

HYDలో నేటి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో, 3 రోజులకు ముందుగానే విదేశీయులు హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట లాంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించిన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశస్థులు మన సంస్కృతిని కొనియాడారు.

News January 13, 2025

మదాపూర్: శిల్పారామంలో మైమరిపించిన నృత్యం

image

సంక్రాంతి పండుగ సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. ఆదివారం ఆంపి థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కందుల కూచిపూడి నాట్యాలయ గురువు రవి కూచిపూడి శిష్యబృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. కళాకారులు అశ్విక, ప్రియాంక సిరి, ఐశ్వర్య, చైత్ర, సురభి, ఆద్య, కీర్తి, ఇసాన్వి, శ్రావ్య, అరుణ, నిధి, శాన్వి, రిగిష్మ తదితరులు సంగీతాన్ని అనుగుణంగా వేసిన నృత్యం మైమరిపించింది.