News April 13, 2025

HYD: అశ్లీల చిత్రాలు చూస్తున్నారా? జాగ్రత్త..!

image

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.

Similar News

News April 16, 2025

HYDలో మోటార్ వాడుతున్నారా? జాగ్రత్త..!

image

HYD జలమండలి అధికారులు నల్లాకు మోటార్ కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభిచారు. మోటార్ వాడకం, నీటి వృథాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. మాదాపూర్‌లో ఎండీ అశోక్ రెడ్డి పర్యటించారు. మొదటి రోజే 64 మోటార్లు స్వాధీనం చేసుకుని, 84 మందికి ఫైన్ విధించారు. మోటార్ కనెక్షన్‌పై ఫిర్యాదు చేయాలంటే జలమండలి అధికారునలు సంప్రదించాలని లేదా 155313కి ఈ నంబర్‌‌కు కాల్ చేయవచ్చని సూచించారు.

News April 16, 2025

HYDలో గంటకు 200 కేసులు

image

10, 20 కాదు గంటకు 200 కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడో కాదు HYDలో. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్లో వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో 4,32,824 రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. HYDలో 1,62,000 కేసులు, రాచకొండలో 53,824, సైబరాబాద్‌లో 2,17,000 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.

News April 16, 2025

HYD: 1.30లక్షల మంది యువకుల దరఖాస్తు

image

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంపై నగర యువత ఆసక్తి చూపారు. నిన్నటితో గడువు ముగియడంతో ఎంత మంది దరఖాస్తు చేశారనే విషయం లెక్కతేలింది. 1.3 లక్షల మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,04,556 దరఖాస్తులు ఆన్‌లైన్‌లోకి రాగా 26,992 మంది ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చారు.

error: Content is protected !!