News April 5, 2025

HYD: ఆ బస్సుల్లోనూ మహిళలకు FREE..!

image

HYDలో అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు లగ్జరీగా ఉండడంతో కొందరు ప్రయాణికులు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం కిందకి రాదని అపోహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బస్సులపై మహాలక్ష్మి FREE పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటించారు.

Similar News

News April 6, 2025

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలు

image

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆదివారం నుంచి నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, ఉరేగింపులు నిర్వహించడం నిషేధించినట్లు చెప్పారు. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 6, 2025

భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

image

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

News April 6, 2025

మా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు: SRH కోచ్

image

ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ 300 కొడుతుందన్న అంచనాలు ఉంటున్నాయి. అవే ఆ జట్టు కొంపముంచాయా? SRH అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మట్ ఆ విషయంపై స్పందించారు. ‘అంచనాల ఒత్తిడి మాపై ఏమాత్రం లేదు. ఇదంతా జట్టుకు బయట జరుగుతున్న విషయం మాత్రమే. అంతర్గతంగా జట్టుపై అది ఎలాంటి ప్రభావమూ చూపించదు’ అని పేర్కొన్నారు. 300 పరుగులు అటుంచి ఈ సీజన్లో మ్యాచులు గెలిచేందుకు కూడా సన్‌రైజర్స్ ఇబ్బంది పడుతుండటం గమనార్హం.

error: Content is protected !!