News December 29, 2024
HYD: ఆగాల్సిందే.. 15 నిమిషాల ముందే ప్రకటన..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకునే రైళ్లు ఏ ఫ్లాట్ ఫాం వైపు వస్తాయనేది కేవలం 15 నుంచి 20 నిమిషాల ముందు మాత్రమే ప్రకటిస్తున్నారు. అప్పటి దాకా ప్రయాణికులు ఆగాల్సిందే. ఎటు వస్తుందో..? తెలియక ప్రయాణికులు ఎంట్రన్స్ బోర్డు వద్దకు వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కోసారి చివరి క్షణంలో ఫ్లాట్ ఫాం నంబర్ మారుతోంది. పునరాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న వేళ, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
Similar News
News January 4, 2025
HYD: లగచర్ల కేసులో సురేష్, శివ కస్టడీకి అనుమతి
లగచర్ల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాన సూత్రధారి సురేష్ ,శివకు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మిగతా నిందితులకు సంబంధించి మాంగ్యా నాయక్, లోక్యా నాయక్ కస్టడీ విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇద్దరు నిందితుల తరుపున కౌంటర్ ధాఖలు న్యాయవాది వేశారు. కౌంటర్ పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.
News January 3, 2025
HYD: ప్రమాణ పత్రం ఇవ్వాలనే దిక్కుమాలిన రూల్ ఏంటి: కేటీఆర్
రాష్ట్రంలో ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అదేం దిక్కుమాలని రూల్ అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రైతు శాసించేలా కేసీఆర్ చూశారని.. నేడు రైతులు యాచించేలా కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రైతుబంధు ఒక సీజన్ ఎగ్గొట్టారని.. అది కూడా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News January 3, 2025
HYD: పోలీసులకు ప్రత్యేక శిక్షణ: డీజీపీ
ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు టీజీఎస్పీలో చేరారని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అని చెప్పారు. వీళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామని, పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా బాక్సింగ్, క్రికెట్‌పై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలన్నది ఆశయంగా పెట్టుకున్నామన్నారు.