News April 12, 2025

HYD: ఆస్తి కోసం కూతురి MURDER

image

మేడ్చల్ బోడుప్పల్‌లో ఆస్తి కోసం అమానుషం జరిగింది. సవతితల్లి లలిత, మరిది రవి, స్నేహితుడు వీరన్నలతో కలిసి మహేశ్వరి (26)ని హత్య చేసింది. పెళ్లి కానుకగా తండ్రి ఇల్లు ఇవ్వబోతున్నారన్న అక్కసుతో DEC 7న చున్నీతో గొంతు బిగించి హత్య చేసి, మృతదేహాన్ని వంగమర్తి వద్ద మూసీలో పాతిపెట్టారు. ఈ నెల 2న తండ్రి ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కి తరలించారు.

Similar News

News April 13, 2025

బాలానగర్‌ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

image

బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 13, 2025

మ్యాచ్ చూడటం ఆనందంగా ఉంది: GHMC మేయర్

image

శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో SRH మ్యాచ్‌ను చూడటం ఆనందంగా ఉందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఆ మ్యాచులో అభిషేక్‌శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఎంతో మందికి గుర్తుండిపోతుందన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు మేయర్‌తో పాటు కే.కేశవరావు వచ్చారు.

News April 13, 2025

HYD: 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్

image

వర్షాలకు ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చనే ఆలోచనతో ఉన్న GHMC వాతావరణ శాఖ, TGDPSలతో కలిసి సమన్వయంతో పని చేయాలని భావిస్తోంది. వర్షాకాలంలో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు వర్షాకాలంలో సమస్యల పరిష్కారానికి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలనే యోచనలో అధికారులున్నారు.

error: Content is protected !!