News March 31, 2025
HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News April 3, 2025
MNCL: KU.. గడువు మరోసారి పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News April 3, 2025
వర్ధన్నపేట: కనిపిస్తే ఫోన్ చేయండి

బుధవారం వర్ధన్నపేటలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. నందనం భారతమ్మ అనే వృద్ధురాలిని నమ్మించి ఓ వ్యక్తి రూ.3లక్షలు దోచుకెళ్లాడు. కాగా, నిందితుడి ఫోటోను వర్ధన్నపేట పోలీసులు విడుదల చేశారు. అతడి వివరాలు తెలిపితే రూ.10వేల నగదు ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.
News April 3, 2025
వర్ధన్నపేట: కనిపిస్తే ఫోన్ చేయండి

బుధవారం వర్ధన్నపేటలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. నందనం భారతమ్మ అనే వృద్ధురాలిని నమ్మించి ఓ వ్యక్తి రూ.3లక్షలు దోచుకెళ్లాడు. కాగా, నిందితుడి ఫోటోను వర్ధన్నపేట పోలీసులు విడుదల చేశారు. నిందితుడి వివరాలు తెలిపితే రూ.10వేల నగదు ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.