News January 8, 2025
HYD: ఆహార నాణ్యతలో తెలంగాణకు 24 RANK
ఆహార నాణ్యతలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 24వ స్థానానికి పడిపోయిందని FSSAI ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్-2024 రిపోర్టును FSSAI అధికారులు విడుదల చేశారు. 100 మార్కులకుగాను కేవలం 35.75 మార్కులు మాత్రమే సాధించడం గమనార్హం. HYD నగరం సహ, అనేక చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార కల్తీ జరిగిన ఘటనలు కోకోల్లలుగా చూసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 9, 2025
HYD: ట్రై సైకిళ్లకు దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి
ఛార్జింగ్ ట్రై సైకిల్‌లకు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగే తెలిపారు. సదరం సర్టీపికేట్ ఉండి, 80% శారీరక వైకల్యం, యూఐడి కార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు ఉన్న దివ్యాంగులు అర్హులుగా తెలిపారు. 2పాస్ ఫోటోలు వికాలాంగులుగా గుర్తించే పూర్తి డాక్యుమెంట్స్ ఈ నెల 18లోపు 33 జిల్లాల అధ్యక్షులు 10మంది పేర్లు తయారు చేసి పంపించాలని కోరారు.
News January 9, 2025
గౌలిదొడ్డి గురుకులంలో 9వ తరగతికి ప్రవేశాలు
గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి తెలంగాణ గురుకుల పాఠశాలలో 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఫిబ్రవరి 23వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.
News January 9, 2025
HYD: జీడిపప్పుతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు!
✓జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది✓చర్మ సంరక్షణకు దోహదపడుతుంది✓మెదడు పనితీరును సైతం మెరుగుపరుస్తుంది ✓కంటి చూపును సైతం మెరుగుపరిచే శక్తి ఉంది✓ఎముకలు బలంగా ఉండటానికి సహకరిస్తుంది✓రక్తంలోని చక్కర స్థాయిలను సైతం కంట్రోల్ చేస్తుంది. •జీడిపప్పు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని TGFPS-RR అనేక తెలిపారు.