News March 20, 2024
HYD: ఈ చిన్నారి GREAT

HYD చందానగర్ వాసి చార్విశ్రీ హుడాకాలనీలోని విద్యావాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. యూట్యూబ్‌లో వీడియో చూసిన చిన్నారి క్యాన్సర్ రోగికి అవసరమయ్యే విగ్ కోసం తన జుట్టు ఇవ్వాలనుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణమూర్తి, మంజూష సహకారంతో 25అంగుళాల పొడవున్న జుట్టును ఇటీవల HYD హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ సంస్థకు అందించింది. ఈవయసులో చిన్నారి ఆలోచన ఆదర్శనీయమని స్థానికులు అభినందించారు.
Similar News
News April 14, 2025
సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు.. జూపార్క్ ఓపెన్

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్‌కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.
SHARE IT
News April 14, 2025
హైదరాబాద్‌లో నేడు ‘జై భీమ్’

అంబేడ్కర్ జయంతోత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. ప్రతి డివిజన్‌లోని విగ్రహాలను ఇప్పటికే నాయకులు అలంకరించారు. ప్రధానంగా ట్యాంక్‌బండ్‌లోని 125 అడుగుల భారీ విగ్రహం చుట్టూ అధికారులు LED లైట్లు అమర్చారు. త్రివర్ణం నడుమ మహానీయుడి విగ్రహం వెలిగిపోతోంది. ఇక లిబర్టీలోని స్టాచ్యూ వద్ద నేడు పెద్ద ఎత్తున కార్యక్రమాలకు పలు పార్టీల నాయకులు ఏర్పాట్లు చేశారు. ‘జై భీమ్’ నినాదాలతో యువత భారీ ర్యాలీ తీయనుంది.
News April 13, 2025
బాలానగర్ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.