News April 9, 2024

HYD: ‘ఉగాది’.. కల్పిస్తోంది ఉపాధి..!

image

శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగ నేపథ్యంలో కుమ్మరులు ఉపాధి పొందుతున్నారు. పండగ వేళ షడ్రుచులతో కూడిన పచ్చడిని మట్టి పాత్రల్లో తయారు చేసి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. పండగను దృష్టిలో పెట్టుకుని HYD, ఉమ్మడి RRలోని కుమ్మరులు నెల రోజుల నుంచే మట్టి పాత్రలను ప్రత్యేకంగా తయారు చేశారు. వారం రోజుల నుంచి ప్రధాన కూడళ్లలో విక్రయానికి ఉంచారు. పాత్ర పరిమాణాన్ని బట్టి రూ.80-రూ.120 వరకు విక్రయిస్తున్నారు.

Similar News

News December 29, 2024

REWIND: బేగంపేట ఎయిర్‌పోర్టులో మన్మోహన్ సింగ్.. గుర్తుచేసుకుంటున్న ప్రజలు!

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసిన HYD ప్రజలు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. బేగంపేట విమానాశ్రయానికి 2011 ఫిబ్రవరి 6న నగర పర్యటనకు వచ్చిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తూ, మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరడానికి తమ వంతు కృషి చేస్తామని పలువురు ట్వీట్లు చేశారు.

News December 29, 2024

నిఘా నీడలో హైదరాబాద్!

image

మహా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్‌, సరూర్‌నగర్‌ పబ్‌లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వేడుకల పేరుతో డ్రగ్స్‌ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులను ఆదేశించారు.

News December 29, 2024

OU: MBA కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్- డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 4వ తేదీలోగా, రూ.300 లేట్ ఫీతో 6వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.