News January 10, 2025
HYD: ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’
వైకుంఠ ఏకాదశి వేడుకలను అన్ని ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’ మంత్రం పఠిస్తూ భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజధాని ప్రజలు పెద్ద ఎత్తున చీర్యాలకు క్యూ కట్టారు. దీంతో ECIL-నాగారం-రాంపల్లి చౌరస్తా- చీర్యాల రూట్‌లో వాహనాల రద్దీ నెలకొంది. SHARE IT
Similar News
News January 10, 2025
HYD: ఎఫ్‌టీఎల్ వివాదానికి త్వరలో పరిష్కారం: రంగనాథ్
బుద్ధ భవన్ హైడ్రా కార్యాలయంలో దుర్గం చెరువు పరిసరవాసులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం నిర్వహించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో వివాదాలకు ఆస్కారం లేకుండా 4 నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మెన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో 6 కాలనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి నుంచి సమాచారాన్ని లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మెన్ అందజేశారు.
News January 10, 2025
HYD: 4 నెలల్లో దుర్గం చెరువు FTL గుర్తింపు
4 నెలల్లో దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ గుర్తించేందుకు హైడ్రా సన్నాహకలు చేస్తుంది. ఎఫ్‌టీఎల్ నిర్ధారణలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో పాటు.. ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ సహకారం చెయ్యనుంది. ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఇమేజీలను, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదిక సిద్ధం చెయ్యనుంది.
News January 10, 2025
HYD: బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతలు వీరే..!
గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో 7రోజుల పాటు జరిగిన ఆల్ ఇండియా జూనియర్ అండర్ 19 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం ముగిసింది. ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో కొలగట్ల వెన్నెల, వలిశెట్టి శ్రేయాన్షి 21-15, 21-16తో తారిని, రేషికపై విజయం సాధించారు. సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్ 21-16, 21-13 స్కోర్‌తో ప్రణవ్ రామ్ రన్నరప్‌గా నిలిచాడు.