News April 1, 2024
HYD: ‘ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.10 లక్షలతో పరార్’
ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు తీసుకుని పరారైన ఘటన HYDలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. విజయవాడకు చెందిన మహమ్మద్ ఇలియాజ్ ‘ESIలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి గండీడ్, పరిగి మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో HYD పంజాగుట్ట PSలో బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం చేయాలని కోరారు.
Similar News
News January 15, 2025
ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా, ప్రతీకారంతోనే కొనసాగిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు, బెయిల్ వ్యవహారంపై ఇవాళ ఉదయం హైదరాబాద్ కోకాపేటలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News January 14, 2025
HYD: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
AICC నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచే వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లనున్నారు.
News January 14, 2025
HYDలో గణనీయంగా తగ్గిన విద్యుత్ వాడకం
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెటూర్లకు తరలివెళ్లారు. దీంతో గృహాలతో పాటు కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. ఉత్పత్తులు, రోజువారి కార్యకలాపాలు నిలిచిపోవడంతో వినియోగం గణనీయంగా తగ్గింది. సోమవారం 2,500 మెగావాట్లకు పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే 700 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారలు తెలిపారు.