News March 2, 2025
HYD: ఉపరాష్ట్రపతికి గవర్నర్ ఘన స్వాగతం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు హరిహర గోపాల్, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 3, 2025
HYD: ‘కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి’

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోని జరుగుతుందన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు.
News March 3, 2025
HYD: రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్

హైదరాబాద్: రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) తరహాలో రోడ్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆర్అండ్బీ శాఖాధికారులు కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డు ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఇతర రహదారులను కూడా మెరుగుపరచడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
News March 3, 2025
రావిర్యాలలో ఏటీఎంను చోరీ.. మూడు బృందాలతో గాలింపు

రావిర్యాలలో SBI <<15626678>>ఏటీఎంను చోరీ<<>> ఘటనపై పోలీసులు 3 బృందాలతో గాలిస్తున్నారు. హరియాణా దొంగలుగా భావిస్తున్న పోలీసులు.. ముంబైవైపు వారు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. 2019లోనూ ఇదే తరహాలో ఆదిభట్లలో ఏటీఎం చోరీ జరిగినట్లు తెలుస్తోంది. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక అలారం మోగకుండా కేబుళ్లను తెంపేసి, సీసీ కెమెరాలపై నల్లటి స్ప్రేను చల్లి ఏటీఎం ధ్వంసం చేసి రూ.29.70 లక్షల నగదును దోచుకెళ్లారు.