News May 21, 2024
HYD: ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్
HYD నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్లర్ బాధ్యతలకు IAS దానకిషోర్ నియమించబడ్డారు. 1996 IAS బ్యాచ్ అధికారి అయిన దానకిషోర్, కర్నూలు జిల్లాలో కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. గత 20 సంవత్సరాల్లో దాదాపు 9 జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. ఇటీవల HMWSSB ఎండి బాధ్యతల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా.. ప్రభుత్వం OU వీసీగా నియమించింది.
Similar News
News January 27, 2025
HYDలో మరో రైల్వే టెర్మినల్..?
HYDలో మరో రైల్వే టెర్మినల్ ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. SCR అధికారులు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కెపాసిటీపై సర్వే చేపట్టారు. మల్కాజ్గిరి స్టేషన్ టర్మినల్ చేస్తే, నిజామాబాద్, నాందేడ్ సహా అన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. అప్పటి DRM వందన సైతం మల్కాజ్గిరిలో రైల్వే టెర్మినల్ కోసం ప్లాన్ చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత చర్యలతో మళ్లీ ఈఅంశం తెరమీదకి వచ్చింది.
News January 27, 2025
పాతబస్తి మెట్రో కోసం.. భగాయత్ లేఅవుట్ల వేలం..!
HYD ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద ఓపెన్ ప్లాట్ల వేలం ద్వారా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిధులను MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే 7.5KM పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణానికి వినియోగించే అవకాశం ఉంది. మరోవైపు, ఈ మెట్రో మార్గంలో ఉండే సుమారు 100 మత, వారసత్వ, సున్నిత నిర్మాణాలను పరిరక్షించేందుకు మెట్రో రైలు సంస్థ ఇంజనీరింగ్ పరిష్కారాలను డెవలప్ చేసింది.
News January 26, 2025
HYD: నేడు భారతమాతకు మహాహారతి కార్యక్రమం
HYDలోని పీపుల్స్ ప్లాజాలో నేడు భారత మాతకు మహాహారతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం భారతమాత విగ్రహాన్ని HMDA మైదానం నుంచి ఊరేగింపుగా నెక్లెస్ రోడ్డుకు తీసుకెళ్లారు. సంవిధాన్ గౌరవ అభియాన్ యాత్ర నేడు ప్రారంభించి 2026 జనవరి 26 వరకు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.