News April 6, 2025
HYD: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం వాట్సప్ గ్రూప్

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణకు ఆర్పీఎఫ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
Similar News
News April 17, 2025
ALERT: నెత్తురోడుతున్న హైదరాబాద్!

HYDలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 790 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 70 మంది చనిపోవడం గమనార్హం. త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు సంబంధించిన యాక్సిడెంట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇకనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించండి.
SHARE IT
News April 17, 2025
HYD: BRS కార్పొరేటర్లు ఓటేస్తారా?

ఈనెల 23న జరిగే HYD స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటేస్తారో, లేదో అని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, MIM పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అనధికారికంగా MIMకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. BRS ఓటర్లు కాంగ్రెస్ మద్దతిచ్చే MIM వైపు మొగ్గు చూపుతారా? లేక తటస్థంగా ఉంటారా అనేదానిపై రాజకీయంగా చర్చసాగుతోంది.
News April 17, 2025
హైదరాబాద్‌లో ఆందోళనలు.. పోలీసుల అప్రమత్తం!

నగరంలో కొద్దిరోజులుగా వరుస ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా చర్యలు చేపట్టారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ముస్లిం సంఘాలు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. SMలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై సైతం పోలీసులు నిఘా పెట్టారు.