News April 16, 2024

HYD: ఎంఫార్మసీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్పెషలైజేషన్ల ఎంఫార్మసీ(సీబీసీఎస్) సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 19, 2025

HYDలో వ్యభిచారం.. పోలీసుల ఫోకస్

image

గ్రేటర్‌లో హ్యుమాన్ ట్రాఫికింగ్‌పై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో వ్యభిచార గృహాలపై మెరుపుదాడులు చేస్తున్నారు. కూకట్‌పల్లిలో వాహనదారులకు సైగలు చేస్తూ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను మంగళవారం బైండోవర్ చేశారు. గత కొద్ది రోజులుగా KPHB మెట్రో సమీపంలో‌నూ నిఘా పెట్టారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News February 19, 2025

గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం

image

HYD గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

News February 19, 2025

HYD: KCR వస్తున్నారు.. ‘కారు’లన్నీ అటువైపే!

image

నగరంలోని తెలంగాణభవన్‌లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్‌కు క్యూ కట్టాయి. భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

error: Content is protected !!