News April 18, 2024

HYD: ఎన్నికలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీల్లో రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ.2,00,13,088 విలువైన ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 185 మందిపై కేసులు నమోదు చేయగా, 181 మందిని అరెస్టు చేసినట్లు రోనాల్డ్ రాస్ వివరించారు.

Similar News

News September 23, 2024

గచ్చిబౌలి: సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే

image

గచ్చిబౌలి పరిధిలోని T-HUBలో సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే వేడుకలు నిర్వహిస్తామని కార్య నిర్వాహకులు తెలిపారు. AI, డిజిటల్ విధానం, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.

News September 23, 2024

HYD: 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు

image

HYDలో 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లో 54,483 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే ఏకంగా 6,439 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 18% పెరగడం గమనార్హం. 2023లో 46,287 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది.

News September 23, 2024

HYD: మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు డబుల్

image

HYD, సికింద్రాబాద్, రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో గతంలో 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరుకుందని అధికారులు తెలియజేశారు. దీన్నిబట్టి గమనిస్తే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్లుగా తెలుస్తోంది.