News March 20, 2025

HYD: ఒక్కో IPL మ్యాచ్.. రూ.1.5 కోట్లు..!

image

ఉప్పల్ స్టేడియం వెన్యూను SRH వాళ్లు రెంట్‌కు తీసుకుంటారని ప్రతి IPL మ్యాచ్ కోసం రూ.1.5 కోట్లు తమకు చెల్లిస్తారని HCA ప్రెసిడెంట్ అన్నారు. IPL మ్యాచులలో HCA పాత్ర పరిమితంగా ఉంటుందని, మిగతా వాటిల్లో HYD ఉప్పల్ స్టేడియం మొత్తం HCA కంట్రోల్లో ఉంటుందని ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు తెలిపారు. దీంతో హౌస్ కీపింగ్, క్లీనింగ్ లాంటి సదుపాయాలు కల్పిస్తామే తప్ప, టికెట్ల ధరలు తమ కంట్రోల్లో ఉండవన్నారు.

Similar News

News March 20, 2025

ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారా?

image

ఏప్రిల్ 1 నుంచి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. ఈ రూల్స్ ప్రకారం డియాక్టివేట్, సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను ఈ నెల 31లోగా తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. ఆ తర్వాత ఈ నంబర్లను ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు పొందలేరని తెలిపింది. అప్డేట్ చేసిన మొబైల్ నంబర్‌ సిస్టమ్‌ను ఉపయోగించి ట్రాన్సాక్షన్ల సంఖ్యను పేర్కొనాలని సూచించింది.

News March 20, 2025

BREAKING: నారాయణపేటలో MURDER 

image

కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన గురువారం NRPTలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఛార్జ్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. నారాయణపేట మండలం గోపితండాకు చెందిన శారు నాయక్(20), వినోద్ నాయక్ భార్యాభర్తలు. భార్య తనకు ఇష్టం లేదని భర్త తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్య శారు నాయక్‌ను బుధవారం రాత్రి భర్త గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

News March 20, 2025

వల్మీడి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన MLA

image

పాలకుర్తి మండలం వల్మీడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయం పరిసరాలను శుభ్రంగా ఉంచి,తాగునీరు, పారిశుధ్యం, తదితర అందుబాటులో ఉంచాలని సూచించారు.

error: Content is protected !!