News November 15, 2024
HYD: ఓపెన్ డిగ్రీ, PG చేయాలనుకునేవారికి నేడు లాస్ట్ ఛాన్స్!
డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం శుక్రవారం www.braou.ac.in ఆన్లైన్లో చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT
Similar News
News November 15, 2024
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్స్ నియామకం
ఓయూ, ఓయూ పరిధిలోని మరికొన్ని కళాశాలలకు ప్రిన్సిపళ్లను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలకు ప్రొ ఖాసీం, సైన్స్ కళాశాలకు ప్రొ. ప్రభాకర్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలకు ప్రొ.శేఖర్, లా కళాశాలకు డా.రాం ప్రసాద్, టెక్నాలజీ కళాశాలకు ప్రొ. రమేశ్ కుమార్, నిజాం కళాశాలకు ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్, సైఫాబాద్ సైన్స్ కళాశాలకు ప్రొ.కే. శైలజ నియమితులయ్యారు.
News November 15, 2024
కార్తీకపౌర్ణమి: HYDలో అంతా శివోహం!
కార్తీకపౌర్ణమి సందర్భంగా HYDలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. దీపాలు వెలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఆలయాల్లో లింగాలను అందంగా అలంకరించారు. శివుడికి రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కీసర, శ్రీశైలం స్వామివార్లను దర్శించుకునేందుకు వందలాది మంది నగరం నుంచి బయల్దేరుతున్నారు.
News November 14, 2024
HYD: మీకు చికెన్, మటన్ షాప్ ఉందా..? జాగ్రత్త..!
HYDలో వేలాదిగా చికెన్, మటన్ షాపులు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికెన్ కట్ చేసే సమయంలో ఈగలు వాలటం, అపరిశుభ్రత కారణంగా పలువురు అస్వస్థత గురయ్యారు. దీనిపై జీహెచ్ఎంసీ వెటర్నరీ, హెల్త్ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. షాప్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.