News March 20, 2025
HYD: ఓయూ బంద్‌కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News March 21, 2025
ప్రకాశం: అన్నాదమ్ములు మృతి.. UPDATE

ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పడమటపల్లిలో గురువారం చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుల వివరాలను పోలీసులు వెళ్లడించారు. గ్రామానికి చెందిన బత్తుల అభిషేక్ (10), బత్తుల పాల్ (8)గా గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు ఒకే కుటుంబానికి చెందిన <<15827660>>అన్నదమ్ములు<<>> కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
News March 21, 2025
NTR: మిషన్ వాత్సల్యపై జిల్లా స్థాయి సమీక్ష

కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం విజయవాడ కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య – శిశు సంక్షేమ, రక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మిషన్ వాత్సల్య లక్ష్యాలు, జిల్లాలో వాటి అమలు పురోగతిపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ చట్టాల అమలు, కుటుంబ ఆధారిత సంరక్షణ, ఆర్థిక సహకారం, బాలల హక్కుల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కమిటీలు ప్రతి 15 రోజులకు సమావేశం కావాలన్నారు.
News March 21, 2025
నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. CPS, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని CM అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరింది.