News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 29, 2025
HYD : రోజుకు 9వేల ట్యాంకర్ల బుకింగ్

నగరంలో నీటి ఎద్దడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక ఉగాది, రంజాన్ పండగలు రావడంతో నీటి వినియోగం కొంచెం ఎక్కువైంది. ఈ క్రమంలో జలమండలి ట్యాంకర్లకు డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు సగటున 9 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని, వాటిని 24 గంటల్లోపే సరఫరా పంపుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటిని సాధ్యమైనంత పొదుపుగా వాడుకోవాలని అధికారులు నగర వాసులకు సూచిస్తున్నారు.24గం.హోమ్ డెలివరీ HYDలో భారీగా బుకింగ్స్
News March 29, 2025
నిమ్స్‌లో ఉచితంగా పీడియాట్రిక్ గుండె శస్త్ర చికిత్సలు

HYD నిమ్స్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ సెంటర్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు అమరేష్ రావు తెలిపారు. తెలంగాణకు చెందిన చిన్నారులతోపాటు ఇక్కడ సెటిల్ అయిన TG, AP ఆధార్ కార్డు ఉన్న కుటుంబాల చిన్నారులకు గుండె సమస్యలు ఉన్నట్లయితే ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామని, వివరాలకు ఆస్పత్రిలో సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 29, 2025
బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.