News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 28, 2025
HYD: నూతనంగా 13 ఎక్సైజ్ స్టేషన్‌లు

కల్తీ కల్లుతో పాటు మత్తు పదార్థాల వినియోగం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎక్సైజ్ స్టేషన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 13 స్టేషన్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మారేడ్‌పల్లి, చిక్కడపల్లి, గండిపేట, కొండాపూర్, మీర్‌పేట్, పెద్దఅంబర్‌పేట్, కొంపల్లి, కూకట్‌పల్లి, కాప్రా, నాచారం, అల్వాల్, అమీన్‌పూర్, బంజారాహిల్స్‌లలో ఏర్పాటు చేయనున్నారు.
News March 28, 2025
HYD: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

MMTSలో యువతిపై అత్యాచారయత్నం జరిగిన కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడం సవాలుగా మారుతోంది. బాధితురాలికి మరోసారి అనుమానితులను చూపించాలని పోలీసులు భావిస్తుండగా.. ప్రస్తుతం ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నారు. కాగా.. గురువారం బాధితురాలి వాంగ్మూలాన్ని మళ్లీ రికార్డు చేశారు.
News March 28, 2025
ఇబ్రహీంపట్నం: మానవ అక్రమ రవాణాపై శిక్షణ కార్యక్రమం

మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రంగారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత తెలిపారు. మానవ అక్రమ రవాణాపై ఏపీఎం, సీసీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేని పిల్లలను, పేదవారిని నమ్మించి వారి ప్రమేయం లేకుండా నగరాలకు తరలించి అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు.